Hyderabad, జూలై 9 -- ఐపీఎల్ - 2025 సీజన్ సందర్భంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, హెచ్ సీఏ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించగా. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.జగన్ మోహన్ రావుతో పాటు మరో నలుగురిని సీఐడీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

జగన్ మోహన్ రావుతో పాటు కోశాధికారి సి.శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కాంటే, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి జి.కవితతో సహా హెచ్ సీఏ ఆఫీస్ బేరర్లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. టికెట్ల వ్యవహారంతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రస్తావించిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారించనున్నారు.

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌-హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొంది. మ...