భారతదేశం, జనవరి 4 -- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB).. T20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ జట్టు భారత్‌కు ప్రయాణించదని స్పష్టం చేసింది. ముస్తాఫిజుర్ రెహమాన్‌కు సంబంధించిన ఐపీఎల్ వివాదం ఈ పరిణామాలకు దారితీసింది. ఆ తర్వాత BCB అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించి, అధికారికంగా మ్యాచ్‌లను తరలించమని ఐసీసీని అభ్యర్థించింది.

ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తప్పించడమే ఈ వివాదానికి నిప్పు రాజేసింది. ఆదివారం (జనవరి 4) ఢాకా నుంచి విడుదల చేసిన ఒక మీడియా ప్రకటనలో తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇండియా, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026కి సంబంధించిన తాజా పరిణామాలపై చర్చించడానికి అత్యవసర సమావేశం నిర్వహించారని బీసీబీ తెలిపింది. బోర్డు గత 24 గంటలుగా పరిస్థితిని సమీ...