భారతదేశం, నవంబర్ 5 -- ఇండియా, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆటలకు రాజకీయాలను దూరంగా ఉంచాలని, ప్రతి లీగ్ లో ప్రతి దేశానికి చెందిన ప్లేయర్ కు ప్రాతినిధ్యం ఉండేలా చూడాల్సిన బాధ్యత ఐసీసీదేనని అతడు స్పష్టం చేశాడు.

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ఐసీసీకి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని అతడు కోరాడు. ఆల్-టైమ్ గ్రేటెస్ట్ లెఫ్ట్-ఆర్మ్ పేసర్‌గా ప్రశంసలు అందుకున్న అక్రమ్.. 'రాజకీయాలను క్రీడల నుండి దూరంగా ఉంచాలి' అని ఐసీసీకి గట్టి సందేశం పంపాడు. దీని ద్వారానే క్రికెట్‌కు సంబంధించి రెండు దేశాల మధ్య ఉన్న వైరానికి ముగింపు పలకొచ్చని అతడు అభిప్రాయపడ్డాడు...