Hyderabad, సెప్టెంబర్ 15 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. అయితే, ఈ గ్రహాల సంచార మార్పు రావడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ నెల చాలా విశేషమైనది. సెప్టెంబర్ నెలలో అనేక గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. ఐదు రోజుల్లో నాలుగు గ్రహాల సంచారంలో మార్పు ఉంది. అదే విధంగా సెప్టెంబర్ 21న సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

సెప్టెంబర్ 13 శనివారం నాడు కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత బుధుడు సెప్టెంబర్ 15న కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 21న సూర్య గ్రహణం...