Hyderabad, మే 14 -- మలయాళం స్టార్ హీరోల్లో ఒకడైన బేసిల్ జోసెఫ్ నటించిన మూవీ మరణమాస్ (Maranamass). గత నెల 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. చెప్పిన తేదీ కంటే ఒక రోజు ముందే అంటే బుధవారం (మే 14) మధ్యాహ్నం 3 గంటల నుంచే స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. తెలుగు సహా మొత్తంగా ఐదు భాషల్లో ఈ సినిమా చూడొచ్చు.

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాప్ 10 అత్యధిక వసూళ్ల సినిమాల్లో మరణమాస్ కూడా ఒకటి. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.19.5 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నిజానికి సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. సక్సెస్ సాధించడం విశేషం. అయితే ఐఎండీబీలో మాత్రం 8 రేటింగ్ సంపాదించింది. ఈ సినిమా బుధవారం (మే 14) మధ్యాహ్నం నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

"ది మ్యాన్, ది మ్యాడ్‌నెస్, ది మాస్.. ల్యూక్ వచ్చేశాడు. ...