Hyderabad, ఆగస్టు 6 -- పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మయసభ (Mayasahba) ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి గురువారం (ఆగస్ట్ 7) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని సోనీ లివ్ ఓటీటీ గతంలో వెల్లడించినా ఇప్పుడు ఒక రోజు ముందే అంటే బుధవారం (ఆగస్ట్ 6) సాయంత్రం నుంచే స్ట్రీమింగ్ మొదలైంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మయసభ. కొన్నాళ్లుగా ఈ సిరీస్ ను బాగానే ప్రమోట్ చేసిన సోనీ లివ్ ఓటీటీ తాజాగా బుధవారం నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

గత వారం ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ సిరీస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన నేతలుగా పేరున్న చంద్రబాబు నాయుడు, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహంగా కనిపించింది. "స్నేహితులే శత్రువులయ్యా...