భారతదేశం, మే 8 -- ఐడీబీఐ బ్యాంకులో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 676 పోస్టులను తాజా నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఐబీపీఎస్ ఆధ్వర్యంలో జరిగే సీబీటీ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.

ఐడిబిఐలో భర్తీ చేసే జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాల్లో 271 అన్‌ రిజర్వ్‌డ్‌ పోస్టులు కాగా 140 ఎస్సీలకు, 74 ఎస్టీలకు, 124 ఓబీసీలకు, 67 ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు 31 పోస్టులను రిజర్వ్‌ చేశారు.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 2025 మే1 వతేదీ నాటికి నిర్దేశిత వయసు కలిగి ఉండాలి. మే 7న ఉద్యోగ ప్రకటన వెలువడింది. మే 8-20వ తేదీల మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మే 8 గురువారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదు, ఎడిట్‌, ఫీజుల చెల్లింపు అనుమతిస్తారు. మే 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది.

దర...