భారతదేశం, డిసెంబర్ 28 -- దేశీ స్టాక్ మార్కెట్లో ఐటీ దిగ్గజాల హవా మళ్లీ మొదలవ్వబోతోందా? గడిచిన ఏడాది కాలంగా నీరసించిన ఐటీ షేర్లు ఇప్పుడు మదుపరులకు మంచి లాభాలను తెచ్చిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు. 2025లో తీవ్రమైన ఒత్తిడిని, సర్దుబాటును (Correction) ఎదుర్కొన్న లార్జ్-క్యాప్ ఐటీ స్టాక్స్, ఇప్పుడు కనిష్ట స్థాయి నుంచి మళ్లీ పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

వచ్చే జనవరిలో ఐటీ కంపెనీల మూడో త్రైమాసిక (Q3 FY25) ఫలితాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ స్టాక్ కొంటే బాగుంటుంది? నిపుణుల అంచనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ సారి ఐటీ ఫలితాల హడావుడి జనవరి రెండో వారం నుంచే మొదలుకానుంది.

జనవరి 12, 2026: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech) తమ ఫలితాలను వెల్లడిస్తాయి.

జనవరి 14,...