భారతదేశం, డిసెంబర్ 22 -- ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'దురంధర్' ప్రభంజనం కొనసాగుతోంది. కేవలం కథ, యాక్షన్ మాత్రమే కాదు, ఈ సినిమాలోని పాటలు కూడా చార్ట్‌ బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా దురంధర్ సినిమాలోని 'షరారత్' అనే డ్యాన్స్ నంబర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

బ్యూటిపుల్ ఆయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా ఆడిపాడిన ఈ సాంగ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ తాజాగా వెల్లడించారు. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ మొదట మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకోవాలని అనుకున్నారట. అయితే, దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం అందుకు ససేమిరా అన్నారని విజయ్ తెలిపారు.

"నా మైండ్‌లో ముందు తమన్నా పేరు మాత్రమే ఉంది. ఆమె అయితేనే ఈ పాటకు నిండుదనం వస్తుందని, సరైన న్యాయం చేస్తుందని ఆదిత్యకు నేను సూచించాను. కానీ, ఆయన చాలా క్లారిటీతో ఉన్నార...