భారతదేశం, జూలై 15 -- ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ విమానాశ్రయ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ఈ నియామకం ద్వారా మొత్తం 1446 పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని సెప్టెంబర్ 21, 2025గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం ఉంది. నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. igiaviationdelhi.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందులో విమానాశ్రయ గ్రౌండ్ స్టాఫ్ కోసం 1017 పోస్టులు, లోడర్ కోసం 429 పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత విషయానికొస్తే, గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే గ్రౌండ్ స్టాఫ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. లోడర్ పోస్టుకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రెండు పోస్టులకు వయోపరిమితిని కూడా విడి విడిగానే నిర్ణయించారు. గ్రౌండ్ స్ట...