భారతదేశం, జనవరి 2 -- ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విపణిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రతిభ ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడు ఐఐటీ హైదరాబాద్ (IIT-H) విద్యార్థి ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్. 2008లో ఈ విద్యాసంస్థ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఇదే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ 'ఆప్టివర్' (Optiver) ఈ భారీ ఆఫర్‌ను ఎడ్వర్డ్‌కు అందించింది.

కేవలం 21 ఏళ్ల వయసున్న ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్ ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చివరి ఏడాది చదువుతున్నారు. గత వేసవిలో ఆప్టివర్ సంస్థలో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసిన ఎడ్వర్డ్, తన ప్రతిభతో సంస్థను ఆకట్టుకుని 'ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్' (PPO) సాధించారు.

ఈ విజయం గురించి ఎడ్వర్డ్ మాట్లాడుతూ.. "నా జీవితంలో ఇది మరచిపోలేని క్షణం. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన మొదటి కంపెనీ, చివరి కంపెనీ ఇదే...