భారతదేశం, డిసెంబర్ 10 -- ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీని భర్తీ చేస్తారు. ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన 1 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేస్తున్నారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం ఈ సంస్థ అర్హతగల భారతీయులను ఆహ్వానిస్తుంది. పదకొండు నెలల పాటు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుంది. ఎంపికైన అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలకు లోబడి పదవీకాలాన్ని మరింత పొడిగించవచ్చు.

గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే రిజర్వేషన్ ఉన్నవారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు తమ విద్యార్హతలు, అనుభవాన్ని ధృవీకరించే ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ (ప్రకటనతో జతచేసిన ఫార్మాట్)తో హాజ...