భారతదేశం, జూలై 19 -- ఐఐటీ ఖరగ్ పూర్ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాదిలో ఇది నాలుగో బలవన్మరణ ఘటన. వర్సిటీకి చెందిన బీటెక్ విద్యార్థి(21) శుక్రవారం హాస్టల్ గదిలో ఉరేసుకుని మృతి చెందాడు. మెకానికల్ ఇంజినీరింగ్ లో నాలుగో సంవత్సరం చదువుతున్న రితమ్ మొండల్ రాజేంద్ర ప్రసాద్ (ఆర్పీ) హాల్ హాస్టల్ భవనంలోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కోల్ కతాకు చెందిన ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి రితమ్ మొండల్ గురువారం రాత్రి భోజనం చేసి రాజేంద్ర ప్రసాద్ హాస్టల్ లోని తన గదికి తిరిగి వచ్చాడు. అతని ప్రవర్తనలో అసాధారణమైనదేమీ కనిపించలేదని అతని హాస్టల్ సహచరుడు ఒకరు చెప్పారు. మరుసటి రోజు ఉదయం రితమ్ తలుపు పదేపదే తట్టినా ఫలితం లేకపోవడంతో ఐఐటీ ఔట్ పోస్టు వద్ద ఉన్న క్యాంపస్ సెక్యూరిటీ, పోలీసులను సహచర విద్యార్థులు అప్రమత్తం చేశారు. వారు తలుపు పగలగొట్టి చ...