భారతదేశం, డిసెంబర్ 19 -- మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో వ్యక్తిగత పొదుపు, పెట్టుబడులపై సరైన అవగాహన కల్పించేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐఎం బెంగళూరు (ఐఐఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఎఫ్​పీఎస్​బీ) ఇండియాతో కలిసి 'పర్సనల్ ఫైనాన్స్ అండ్ వెల్త్ అడ్వైజరీ' (పీఎఫ్​డబ్ల్యూఏ) అనే సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించింది.

ఐఐఎంబీకి చెందిన 'సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్' (సీసీఎంఆర్​ఎం) ఈ కోర్సును నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కోర్సు కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మార్చి 2026 నుంచి తరగతులు మొదలవుతాయి.

ప్రస్తుతం సామాన్య ప్రజలు కూడా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఆర్థిక రంగానికి సంబంధించిన చిక్కుముడులను విప్పి, పెట్టుబడిదారులకు సరైన సలహాలు ఇచ్చే ని...