భారతదేశం, జనవరి 12 -- హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ప్రముఖ వార్తా సంస్థ ఎన్టీవీతోపాటుగా ఇతర న్యూస్ ఛానళ్లపై కేసు నమోదు చేశారు. దీనికి కారణం మహిళా ఐఏఎస్ అధికారిపై కథనాలు ప్రచురించడమే. ఈ వార్తలపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు చేశారు.

ఇటీవల ఒక మహిళా ఏఐఎస్ అధికారిపై వార్తలు ప్రసారం కావడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఇలాంటి తప్పుడు వార్తలపై తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసినందుకు కూడా కేసు నమోదు అయింది.

ఎన్‌టీవీ యాజమాన్యం, ఎడిటర్లు, రిపోర్...