భారతదేశం, జనవరి 25 -- భారత పరిపాలనా రంగానికి వెన్నెముకగా నిలిచే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ అధికారుల క్యాడర్ కేటాయింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో 'క్యాడర్ అలోకేషన్​ పాలసీ 2026'ను తీసుకువచ్చింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) డైరెక్టర్ యషు రుస్తాగి ఇటీవలే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ విధానం 2017 నాటి పాత ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిగా మార్చివేసింది. గతంలో ఉన్న 'జోనింగ్' వ్యవస్థను రద్దు చేస్తూ, ఖాళీల భర్తీకి కచ్చితమైన గడువులను నిర్ణయించింది. ఆల్​ ఇండియా సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ఆయా రాష్ట్రాలకు లేదా సంయుక్త క్యాడర్లకు కేటాయించే విధానమే ఈ 'క్యాడర్ అలొకేషన్ పాలసీ'. రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతస్థాయిలో చర్చించిన తర...