భారతదేశం, నవంబర్ 5 -- తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. ఇవాళ(05-11-2025) కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రేపు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. అకస్మాత్తుగా ఉరు...