Telangana,andhrapradesh, సెప్టెంబర్ 12 -- ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. రేపటి వరకు పశ్చిమమధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం. ఇవాళ(సెప్టెంబర్ 12) పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక శ్రీకాకుళం,విజయనగరం,మన్యం,అల్లూరి ,విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి,కృష్ణా,సత్యసాయి, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. తీరం వెం...