భారతదేశం, నవంబర్ 7 -- ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. కొన్నిచోట్ల పిడిగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం. శుక్రవారం(నవంబర్ 07, 2025) కోనసీమ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

ఇక రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే సూచలున్నాయి. ఇక రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చు. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

మరో...