Telangana,hyderabad,andhrapradesh, ఆగస్టు 2 -- తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలుకానున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. ఏపీలో ఆగస్ట్ 7వ తేదీ వరకు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండగా. తెలంగాణలో ఆగస్ట్ 4వ తేదీ నుంచి షురూ కానున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం..రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలుపడొచ్చు. కొన్నిచోట్ల స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి (ఆగస్ట్ 4)పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి...