భారతదేశం, నవంబర్ 19 -- వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏరడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 48 గంటల్లో మరింత స్పష్టంగా ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా రిపోర్ట్ ప్రకారం... ఇవాళ, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. అయితే రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీ నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది.

ఇక నవంబర్ 22వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు పడొచ్చు. పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ...