భారతదేశం, ఏప్రిల్ 21 -- వేసవి నేపథ్యంలో దేశంలో ఉష్ణోగ్రతలకు సంబంధించిన లేటెస్ట్​ అప్డేట్స్​ని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. వాయువ్య, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. కాగా ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఏప్రిల్ 21 నుంచి 23 వరకు విదర్భ, ఏప్రిల్ 24 వరకు దక్షిణ ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 23, 24 తేదీల్లో రాజస్థాన్, దక్షిణ హరియాణాలో హీట్​వేవ్​ పరిస్థితులు కనిపిస్తాయి.

వాయువ్య భారతంలో ఏప్రిల్​ 21 నుంచి వచ్చే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని, రాబోయే రెండు రోజుల్లో మాత్రం గణనీయమైన మార్పు ఉండదని ఐఎండీ తెలిపింది. మధ్య భారతదేశ...