Hyderabad, ఆగస్టు 19 -- ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో ఇద్దరు యువ నటీనటులను వెనక్కి నెట్టి కూలీ మూవీ టీమ్ నుంచి లోకేష్, రజనీ టాప్ లోకి దూసుకురావడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర్ కూలీ సంచలనాలు సృష్టిస్తున్న వేళ ఈ ఇద్దరూ ఇటు ఐఎండీబీలోనూ సత్తా చాటుతున్నారు.

బాలీవుడ్ లో'సయ్యారా' మూవీ జులై 18న విడుదలైన తర్వాత ఆ సినిమా దర్శకుడు మోహిత్ సూరి, అందులో నటించిన నటీనటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అహాన్, మోహిత్, అనీత్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. కానీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'కూలీ' మూవీ విడుదలైన తర్వాత వారి స్థానాలను లోకేష్, రజనీకాంత్ ఆక్రమించారు.

ఈ వారం ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో లోకేష్ మొదటి స్...