Hyderabad, మే 16 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ డ్రామా అభిలాషం (Abhilasham). మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అయితే ఐఎండీబీలో మాత్రం ప్రేక్షకులు 9.2 రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. వచ్చే వారమే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

మలయాళం నటుడు సైజు కురుప్ నటించిన మూవీ అభిలాషం. ఈ సినిమా మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళం ఆడియోతోనే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీ రానుంది.

మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఇందులో సైజు కురుప్ తోపాటు అర్జున్ అశోకన్, తన్వి రామ్ నటించారు. ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

అభిలాషం మూవీ అ...