భారతదేశం, డిసెంబర్ 6 -- ఐఆర్‌సీటీసీ టూరిజం అనేక రకాల టూర్ ప్యాకేజీలు అందిస్తుంది. చాలా దూర ప్రాంతాలకే కాదు. హైదరాబాద్ చుట్టు పక్కల, శ్రీశైలం లాంటి క్షేత్రాలకు కూడా ప్యాకేజీలు ఉన్నాయి. బడ్జెట్ ధరలోనే మీరు అన్ని చూసి రావొచ్చు. ఐఆర్‌సీటీసీ స్పిరిట్యువల్ తెలంగాణ విత్ శ్రీశైలం టూర్ ప్యాకేజీని అందిస్తోంది. మెుత్తం మూడు రాత్రులు, నాలుగు రోజులు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రయాణం మెుదలవుతుంది. డిసెంబర్ 10వ తేదీన టూర్ ప్యాకేజీ ఉంది.

మెుదటి రోజు హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శిస్తారు. హోటల్‌కు తిరిగి వెళ్తారు. హైదరాబాద్‌లో డిన్నర్, రాత్రి బస చేయండి.

రెండో రోజు హైదరాబాద్ - శ్రీశైలం వెళ్తారు. ఉదయం 5 గంటలకు హోటల్ నుండి పికప్ చే...