భారతదేశం, ఏప్రిల్ 17 -- సికింద్రాబాద్ నుంచి విజ‌య‌వాడ మీదుగా పూరి, గయా, కాశీ అయోధ్య, ప్రయోగ్‌రాజ్‌ త‌దిత‌ర పుణ్య‌క్షేత్రాల‌కు ప్రత్యేక రైల‌ును ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. ఈ మేరకు విజ‌య‌వాడ డివిజ‌న్ ఏరియా మేనేజ‌ర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

పూరి, కోణార్క్‌, గ‌యా, వార‌ణాసి, అయోధ్య‌, ప్ర‌యాగ్‌రాజ్‌ సంద‌ర్శ‌నార్థం వెళ్లే భ‌క్తుల‌కు కోసం ఐఆర్‌సీటీసీ భార‌త్ గౌర‌వ్ ప్ర‌త్యేక రైలు న‌డుపుతుంది. 10 రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఆరు ముఖ్య‌మైన తీర్థ‌యాత్ర‌లు, చారిత్ర‌క ప్ర‌దేశాలు సంద‌ర్శ‌న ఉంటుంది.

మొత్తం తొమ్మిది రాత్రులు, ప‌ది ప‌గ‌ల‌తో ఈ యాత్ర ఉంటుంది. ఈ రైలు మే 8న సికింద్రాబాద్‌లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, తిరిగి మే 17న‌ ప్ర‌యాణ‌మ‌వుతుంది. ప్ర‌యాణికులు ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలి. అలాగే భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఓట‌ర్ ఐడీ, పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డ్ వం...