భారతదేశం, నవంబర్ 24 -- తమిళనాడులోని ఆలయాలను సందర్శించాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. అదే టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు. ఇందులో మీరు ప్రముఖ ఆలయాలను సందర్శి్స్తారు. తంజావూరు, కుంభకోణం, పుదుచ్చేరి, కాంచీపురం లాంటి ప్రముఖ ప్రదేశాలకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ డిసెంబర్ 6వ తేదీన అందుబాటులో ఉంది. ఆరు రాత్రులు, 7 రోజుల టూర్ ఇది.

మెుదటి రోజు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయల్దేరి తిరుచ్చి వెళ్తారు. తర్వాత హోటల్‌లో చెకిన్ అవుతారు. డిన్నర్ చేసి తిరుచ్చిలోనే స్టే ఉంటుంది.

రెండో రోజు హోటల్‌లో అల్పాహారం చేసి శ్రీరంగం ఆలయం, జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత చెక్ అవుట్ చేసి తంజావూరుకు బయలుదేరుతారు. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించి.. సాయంత్రం కుంభకోణం వెళ్తారు. రాత్రి భోజనం చేసి కుంభకోణంలోనే బస చేస్తారు.

మూడో ...