భారతదేశం, డిసెంబర్ 27 -- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతేడాది పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈ థియేటర్లో తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసులో కొత్త అప్ డేట్ వచ్చింది. చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో ఏ11గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును చేర్చారు.

2024లో చోటు చేసుకున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూశారు. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారని శనివారం (డిసెంబర్ 27) తెలిసింది. ఇందులో ఏ11గా అల్లు అర్జున్ ఉన్నాడు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ను పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ థ...