భారతదేశం, జనవరి 8 -- రాకింగ్ స్టార్ యశ్ (Yash) పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా రిలీజ్ అయిన 'టాక్సిక్' మూవీ టీజర్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. కారులో రొమాన్స్, చేతిలో గన్, నోట్లో సిగరెట్‌తో యశ్ చూపించిన స్వాగ్ మామూలుగా లేదు. అయితే ఈ టీజర్ చూసిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) షాక్ అయ్యాడు. ఈ సినిమా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ టేకింగ్ చూసి.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. "మగ డైరెక్టర్లు కూడా ఆమె ముందు పనికిరారు" అంటూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

యశ్ 19వ సినిమాగా వస్తున్న 'టాక్సిక్' టీజర్ సోషల్ మీడియాను రెండుగా డివైడ్ చేసింది. కొందరు ఇది టూ మచ్ వైలెన్స్ అంటుంటే, ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే టీజర్ ఉందని చాలా మ...