భారతదేశం, డిసెంబర్ 28 -- నటుడు శివాజీ హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతూ నోరు జారిన సంగతి తెలుసు కదా. ఇప్పటికీ అతని కామెంట్స్ పై డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పతంగ్ మూవీ సక్సెస్ మీట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతడు ఏమన్నాడో చూడండి.

నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పై పతంగ్ మూవీ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ స్పందించాడు. అక్కడే ఉన్న మూవీ హీరోయిన్ ను చూస్తూ.. "ఏంటి ఇలా మామూలు డ్రెస్ వేసుకొచ్చావ్.. కాస్త గ్లామరస్ గా రావచ్చు కదా. మీకు అమ్మాయిలు, హీరోయిన్లు ఏ డ్రెస్సు కంఫర్టబుల్, కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుందో అవే వేసుకోండి. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినక్కర్లేదు. ఈ డ్రెస్సు వేసుకుంటే బాగుంటారు.. ఈ డ్రెస్సు వేసుకుంటే ఇదైపోతారు అనేది ఏమీ లేదు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే మం...