భారతదేశం, జనవరి 7 -- భారతీయుల ఇళ్లలో 'పప్పు-అన్నం' అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఎంత విలాసవంతమైన వంటకాలున్నా, వేడివేడి పప్పు అన్నం తింటే వచ్చే తృప్తి వేరు. అయితే, పప్పు కేవలం రుచి కోసమే కాదు.. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే సంజీవని కూడా. గుండె సంబంధిత సమస్యల నుండి మధుమేహం వరకు, మనం ఎంచుకునే పప్పు మన ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుంది.

ప్రముఖ పోషకాహార నిపుణురాలు దీప్శిఖ జైన్ (MSc Global Public Health Nutrition, UK), మనకు ఎదురయ్యే సాధారణ ఆరోగ్య సమస్యలను బట్టి ఏ పప్పును ఆహారంలో చేర్చుకోవాలో సోషల్ మీడియా వేదికగా వివరించారు. ఆ వివరాలు మీ కోసం..

గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలు గుండెపై ప్రభావం చూపుతాయి.

"గుండె ఆరోగ్యం మందగించిన వారు శనగలను త...