భారతదేశం, జూన్ 11 -- ఏసీ ఉష్ణోగ్రతల ప్రామాణికీకరణకు కేంద్రం నడుం బిగించింది. ఎయిర్ కండిషనింగ్ ప్రమాణాలకు సంబంధించి త్వరలో కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఆ నిబంధనల ప్రకారం.. ఎయిర్ కండిషనర్లను 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు కానీ, లేదా 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువకు కానీ సెట్ చేయడం కుదరదు. అలా ఏసీ ఉష్ణోగ్రతలను పరిమితం చేయడంపై భారతదేశం త్వరలో ఒక ప్రయోగాన్ని నిర్వహించనుందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం చెప్పారు.

ఎయిర్ కండిషనింగ్ ప్రమాణాలకు సంబంధించి త్వరలో కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. ఏసీ ల కోసం ఉష్ణోగ్రత ప్రమాణీకరణ 20 degC నుండి 28degC మధ్య సెట్ చేయబడుతుంది. అంటే మనం 20degC కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు, లేదా 28degC కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు మన ఏసీలను సెట్ చేయలేము. 'టెంపరేచర్ సెట్టింగ్స్ ను ప్రామ...