Telangana,hyderabad, సెప్టెంబర్ 17 -- తెలంగాణ విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ సోదాల్లో భాగంగా భారీగా డబ్బులతో పాటు ఆస్తులను గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో. అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి జరిపిన ఈ సోదాల్లో భాగంగా. భారీగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది.

అక్రమంగా కూడబెట్టిన ఆస్తులకు బంధువులను బినామీలుగా చేసి అంబేద్కర్ కోట్లు కూడబెటినట్లు తేలింది. సిటీలో పలు చోట్ల విలువైన స్థలాలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. తనిఖీల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.2.18 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవటంతో పాటు అంబేడ్కర్ న...