భారతదేశం, నవంబర్ 21 -- గత ఆరు నెలల్లో పెయింట్స్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఏషియన్ పెయింట్స్ (Asian Paints) స్టాక్ ధర అసాధారణంగా పెరిగింది. ఈ స్టాక్ ఏకంగా 25% పెరగడం గమనార్హం. గత సంవత్సరం దారుణమైన అమ్మకాలను చవిచూసిన ఈ స్టాక్, ఈసారి అక్టోబర్‌లో 7%, నవంబర్‌లో 15% ర్యాలీతో పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపుతోంది.

నిజానికి, 2024 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో, గ్రాసిమ్ (Grasim) మద్దతుతో వచ్చిన 'బిర్లా ఓపస్' (Birla Opus) పెయింట్స్ రంగంలోకి ప్రవేశించడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఆ సమయంలో ఏషియన్ పెయింట్స్ స్టాక్ మూడు నెలల్లో ఏకంగా 35% పతనమైంది.

2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన బిర్లా ఓపస్.. ఏషియన్ పెయింట్స్ ఆధిపత్యాన్ని కొంతవరకు దెబ్బతీసింది. ఎలారా క్యాపిటల్ (Elara Capital) డేటా ప్రకారం, 2025 మార్చి నాటికి బిర్లా ఓపస్ దాదాపు 7% మార్కెట్ వాటాను వ...