భారతదేశం, మే 14 -- ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో బుధవారం మధ్యాహ్నం కోమటిగుంట చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందారు. భీమడోలు మండలంలోని పెదలింగంపాడులో ఓ వేడుకకు హాజరైన నలుగురు యువకులు తిరుగు ప్రయాణంలో కాలకృత్యాల కోసం కోమటిగుంట చెరువు వద్ద ఆగారు.

ప్రమాదవశాత్తూ చెరువులో పడి ముగ్గురు మరణించారు. మృతులు పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన అజయ్‌ (28), అభిలాష్‌ (16), సాగర్‌ (16)గా పోలీసులు గుర్తించారు.

వైఎస్ఆర్ కడప జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో చెరువులో దిగిన ఐదుగురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు.చెరువులో మునిగిన చిన్నారులను తరుణ్, చరణ్, పార్దు , హర్ష, దీక్షిత్‌గా గుర్తించారు. సమాచారం అందుకొన్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలు...