భారతదేశం, డిసెంబర్ 27 -- ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం భీమడోల్ మండల పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుంది. సూరప్పగూడెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు.

మృతుల్లో ఇద్దరు ద్వారక తిరుమల గ్రామానికి చెందినవారు కాగా. మూడో వ్యక్తి తిమ్మపురం గ్రామానికి చెందినవారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారని భీమడోల్ ఇన్స్పెక్టర్ జోసెఫ్ విల్సన్ తెలిపారు. కేసు నమోదు చేశామని. కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.మరోవైపు సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. సయ్య...