భారతదేశం, డిసెంబర్ 12 -- సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని 1999 నాటి బ్లాక్‌ బస్టర్ చిత్రం 'పడయప్ప' (తెలుగులో నరసింహ) దేశవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. చెన్నైలో 10,000కు పైగా ప్రీ రిలీజ్ టికెట్స్ అమ్ముడు పోయి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

అలాగే, మధురైలో హౌస్‌ఫుల్ షోలతో నరసింహ మూవీ కొత్త సినిమా రిలీజ్ రేంజ్‌లో రికార్డులు సృష్టించింది. ఈ చారిత్రక రీ-రిలీజ్‌ను అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగే. ఈసారి అది మరింత ప్రత్యేకమైంది. ఆయన 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని, 1999లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బ్లాక్‌ బస్టర్ చిత్రం 'పడయప్ప' దేశవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ అయింది.

కేవలం రీ-రిలీజ్ అయిన పాత సినిమా మాదిరి కాకుండా, ఇది ఒక కొత్త సినిమా వ...