భారతదేశం, ఏప్రిల్ 21 -- ండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), కాన్పూర్ నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2025 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 23, 2025న ప్రారంభం కానుంది. ఆసక్తిగల అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2025 మే 2గా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజును 5 మే 2025 వరకు సమర్పించవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 మే 18న జరగనుంది. అభ్యంతర విండో- మే 26 నుంచి 27 మే 2025 వరకు తెరుచుకుంటుంది. ఫైనల్ ఆన్సర్ కీ- 2 జూన్ 2025 వస్తుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఒక విద్యార్థి వరుసగా రెండు సంవత్సరాల్లో రెండుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాయగలరు. జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత ప్రమాణాల ప్రకారం, జేఈఈ మెయిన్స్ 2025 ...