భారతదేశం, ఏప్రిల్ 25 -- దేశంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హీట్​వేవ్​ గురించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక అప్డేట్​ ఇచ్చింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్​ 30 వరకు హీట్​వేవ్​ పరిస్థితులు కొనసాగుతాయని ప్రజలను హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్: పశ్చిమ మధ్యప్రదేశ్​లో ఏప్రిల్ 24 నుంచి 30 వరకు, తూర్పు మధ్యప్రదేశ్​లో ఏప్రిల్ 24, 27 తేదీల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

రాజస్థాన్: ఏప్రిల్ 25, 30 తేదీల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఉత్తర్​ప్రదేశ్, విదర్భ, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ్​ బెంగాల్: ఏప్రిల్ 26 వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

పంజాబ్, హరియాణా: ఏప్రిల్ 25-29 మధ్య వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఛత్తీస్​గఢ్, తెలంగాణ, మధ్య మహారాష...