భారతదేశం, జనవరి 21 -- అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ సర్కార్ ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది. గతేడాది జులై నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి రాయితీ కూడా ఇస్తున్నారు. అయితే ఈ గడువు పలుమార్లు పొడిగించారు. అయితే పొడింపు సమయం కూడా దగ్గరపడింది. ఈనెల 23వ తేదీతో ఎల్ఆర్ఎస్ గడువు పూర్తవుతుంది. కాబట్టి అర్హులైన వాళ్లు. వెంటనే ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ పథకం ద్వారా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమబద్ధీకరణతో 75 వేల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ నెల 23లోపు ఫీజులు చెల్లిస్తే డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది.

ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే వారికి ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీల్లో ప్రభుత...