Telangana,hyderabad, జూలై 16 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా. ఏపీలో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం..ఇవాళ (జూలై 16) రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల గంటకు 30 - 40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అంచనా వేసింది.

రేపు (జూలై 17) రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్నిచోట్ల గంటకు 30 - 40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచ్చే ఛాన్స్ ఉంది....