Hyderabad,telangana,andhrapradesh, ఆగస్టు 6 -- ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో నాలుగు రోజులపాటు కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉండనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం... రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(ఆగస్ట్ 07) రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల్...