Andhrapradesh, జూలై 18 -- ఈశాన్య బంగాళాఖాతంలోని ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(జూలై 19) వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడొ...