Andhrapradesh,telangana, సెప్టెంబర్ 13 -- పశ్చిమమధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది.

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు నాలుగు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇవాళ తెలంగాణలోని నిర్మల్, నిజామాబాజ్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా...