Telangana,andhrapradesh, ఆగస్టు 24 -- తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. . ఆగస్టు 25వ తేదీన బంగాళాఖాతంలోని ఒడిశా-బెంగాల్‌ తీరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. పలుచోట్ల 30 నుంచి 40 క...