భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఏపీ తెలంగాణలో వాతావరణం మారుతోంది. గత కొద్దినెలలుగా చలి తీవ్రత కొనసాగగా. ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది. శివరాత్రి రాకతో దాదాపుగా చలి పూర్తి అయినట్లే. ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం. తెలంగాణలోని చాలా ప్రాంతాలలో రాబోయే కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటనున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 17-19 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొన్నిచోట్ల అకాల వర్షాలు పడే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 28 తేదీల్లో ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు పడొచ్చు. ఉరుములతో కూడా గాలులు వీచే అవకాశం ఉంటుంది.ఫిబ్రవరి 19వ తేదీ తర్వాత ఈ వర్షాలకు సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

హై...