భారతదేశం, ఫిబ్రవరి 15 -- మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ షురూ అయింది. ప్రధాన ఆలయాలతో పాటు మిగతా ఆలయాల్లో కూడా సందడి నెలకొంది.
ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కోటప్పకొండ వంటి క్షేత్రాలకు లక్షలాది మంది తరలివస్తున్నారు. తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, కీసర, రామప్ప, వేయ్యి స్తంభాల గుడి, చెర్వుగట్టు వంటి ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణలతో శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులోనూ ఇవాళ మహాశివరాత్రి పర్వ దినం కావటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.