Telangana,andhrapradesh,delhi, జూలై 25 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రాల్లో డీలిమిటేషన్ కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉన్నాయని పేర్కొంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ .కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

జమ్ముకశ్మీర్‌లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్ తరపున న్యాయవాది కిషన్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కి పరిమితి ఉందని తెలిపింది. 2026లో మొదటి జన గణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని ప్రస్తా...