భారతదేశం, నవంబర్ 7 -- ఏపీ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే తుది నివేదికను అందజేయనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం విలీన గ్రామాల అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ స్థానికుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశారు.

భద్రాచలం రామాలయ అభివృద్ధితో పాటు ఐదు విలీన గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఉష్ణ గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉందని లేఖలో వివరించారు.

2014లో ఆంధ్రప్రదేశ్ పున...