Andhrapradesh, అక్టోబర్ 15 -- ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జీలు రానున్నాయి. వీరిలో జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ దొనాడి రమేశ్, జస్టిస్‌ సుభేందు సామంత ఉన్నారు. వీరు వేర్వురు కోర్టుల్లో పని చేస్తుండగా. వీరి బదిలీకి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు.

గుజరాత్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్, అలహాబాద్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ రమేశ్‌ ఏపీ హైకోర్టుకు రానున్నారు. ఇక కోల్‌కతా హైకోర్టు నుంచి జస్టిస్‌ సుభేందు సామంత బదిలీ అవ్వనున్నారు. ఈ ముగ్గురి రాకతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం ఆగస్టు 25న సమావేశమై ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

జస్టిస్‌ దొనడి రమేష్‌ ది చ...